తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-

ఒంగోలులో ప్రాంతీయ స్థాయి వర్క్‌షాప్ విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో భాగంగా పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, మార్కాపురం జిల్లాల నుండి అధికారులు పాల్గొన్నారు. కిషోర్ వికాసం కార్యక్రమం కింద బాలబాలికల కోసం వేసవి సమ్మర్ క్యాంపులను నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించారు.ఈ సమ్మర్ క్యాంపుల ప్రధాన ఉద్దేశ్యం కిషోర బాలబాలికల్లో జీవన నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు పెంపొందించడం, వారికి ఆత్మవిశ్వాసం కల్పించడం. అలాగే వేసవి సెలవుల సమయంలో బాల్య వివాహాలు, బాల కార్మికత్వం వంటి సామాజిక సమస్యలను నివారించడం ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యంగా ఉంది.బాలల విద్యను కొనసాగించేందుకు ప్రోత్సహించడం, స్కూల్ డ్రాప్‌అవుట్‌లను తగ్గించడం, శారీరక వ్యాయామాలు, క్రీడల ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, సృజనాత్మకతను పెంపొందించడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించబడింది.సచివాలయ స్థాయిలో బాలబాలికలతో పీర్ గ్రూప్‌లను ఏర్పాటు చేసి, బృంద చర్చల ద్వారా వారి సమస్యలను పంచుకునేలా చేయడం, నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చెందేలా ప్రోత్సహించడం జరుగుతుంది. ఈ విధంగా కిషోర్ వికాసం సమ్మర్ క్యాంపులు బాలబాలికల సమగ్ర అభివృద్ధికి తోడ్పడనున్నాయి.సమ్మర్ క్యాంపు ముఖ్య అంశాలుగా ఆరోగ్యం,పోషణ,
బాల్య వివాహాల నివారణ,
లింగ సమానత్వం,
బాలల హక్కులు, రక్షణ,డిజిటల్ సురక్ష,
నాయకత్వం, టీమ్ వర్క్,శారీరక దారుఢ్యం,క్రీడలు,
కమ్యూనిటీ భాగస్వామ్యం, బాధ్యత,
సృజనాత్మకత మరియు ప్రతిభాభివృద్ధి ఉన్నాయి.
ఈ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సూర్యకుమారి, ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి , మహిళా శిశు సంక్షేమ శాఖ ఆర్‌జేడీ మనోరంజని, ఐసీడీఎస్ పీడీ నాగమణి పాల్గొన్నారు. అదనంగా స్కూల్ ఎడ్యుకేషన్, మెడికల్, సెర్ప్, ఐసిడిఎస్,, ఐసీపీస్,విభాగాల అధికారులు కూడా పాల్గొని తమ సూచనలు అందించారు.ఈ వర్క్‌షాప్ ద్వారా జిల్లాల మధ్య సమన్వయం పెంపొందించి, కిషోర్ వికాసం సమ్మర్ క్యాంపులను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *