తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-

. కందుకూరు పట్టణంలో చిన్నారుల కేరింతలు… విద్యార్థుల ఉత్సాహం… తల్లిదండ్రుల గర్వం… వెరసి స్థానిక శ్రీ సంస్కృతి స్కూల్లో “గ్రాడ్యుయేషన్ డే “వేడుకలు అద్భుతమైన రీతిలో జరిగాయి. నల్లటి కాన్వొకేషన్ గౌన్లు, గ్రాడ్యుయేషన్ టోపీలు ధరించిన చిన్నారి విద్యార్థులు రేపటి తరం మేధావులుగా మెరిసిపోయారు. ప్రాథమిక విద్యా దశను విజయవంతంగా పూర్తి చేసుకున్న ప్రతి విద్యార్థికి అతిధుల చేతుల మీదుగా పట్టాలను మరియు జ్ఞాపికలను అందజేశారు. పట్టాలు అందుకున్న విద్యార్థుల కళ్ళలో మెరిసిన ఆత్మవిశ్వాసం వేడుకకే హైలైట్ గా నిలిచింది.తమ పిల్లల విద్యా ప్రస్థానంలో తొలి మైలురాయిన అధిగమించటం చూసి తల్లిదండ్రులు ఆనందభాష్పాలతో మురిసి పోయారు. పాఠశాల యాజమాన్యం తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధను వారు శ్లాఘించారు.ఈ కార్యక్రమంలో చైర్మన్ కొంకా చంద్రశేఖర్ మాట్లాడుతూ సంప్రదాయం ఆధునికతను జోడిస్తూ విద్యార్థులను ప్రపంచస్థాయి సవాళ్లకు సిద్ధం చేయడమే మా లక్ష్యమని, ఈ విజయ ప్రస్థానంలో సహకరించిన తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు, ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేశారు.ఈ వేడుకలో ప్రిన్సిపాల్ హరి,వైస్ ప్రిన్సిపాల్ శోభారాణి,ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థుల కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. జాతీయ గీతాలాపనతో ఈ చారిత్రక ఘట్టం ముగిసింది.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *