తొలి శుభోదయం న్యూస్ కంభం:-
మార్కాపురం జిల్లా కంభం: పట్టణంలో రోడ్ల ప్రక్కన చిరు వ్యాపారం చేసుకొని జీవించే పేదలకు “స్పందించే హృదయాలు చారిటబుల్ ట్రస్ట్” ఆధ్వర్యంలో, ఎండ నుండి, ఉపశమనం కలిగించేందుకు, ఈరోజు శుక్రవారం గొడుగులు పంపిణీ చేశారు. స్థానిక కందులాపురం కూడలిలో చెప్పులు కుట్టుకునే వారికి, పండ్ల వ్యాపారం చేసుకునే వారికి, సోడాలు అమ్ముకునే వారికి, పలు ప్రాంతాల్లో వివిధ వర్గాల వారికి సేవా కార్యక్రమాలలో భాగంగా గొడుగులను పంపిణీ చేశారు. ముఖ పుస్తకం, వాట్సప్ వంటి సామాజిక మాధ్యమాలే వేదికగా, వివిధ ప్రాంతాలకు చెందిన వ్యక్తుల ఆర్థిక సహకారంతో, సేవా కార్యక్రమాలను తెలుగు రాష్ట్రాలలోని ఎంపిక చేసిన ప్రాంతాలలో, అమలు చేస్తున్నట్లు ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పులి శ్రీనివాస ప్రసాద్ తెలిపారు. స్థానిక కెపి రెసిడెన్సి అధినేత కాసుల పాండు, ఒంగోలు వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి సిరిగిరి శ్రీనివాసరావు, హైదరాబాద్ నుండి మున్నూరు శ్రీనివాస్, కంభం లయన్స్ క్లబ్ సభ్యులతో పాటు, పలువురు వ్యక్తులు, ఈ గొడుగుల పంపిణీకి ఆర్థికంగా చేయూతనిచ్చారని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు తన్నీరు బాల రంగారావు, కార్యదర్శి సిరిగిరి వెంకటరావు, సీనియర్ లయన్ మెంబర్లు, నరాల.ఈశ్వరరెడ్డి, టిసిహెచ్ కాశయ్య, కె.వి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.