తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం / తూర్పు నాయుడుపాలెం:-

ఇండియన్ నేషనల్ టాలెంట్ చర్చ్ ఒలింపియాడ్ లెవెల్ -2 ఎగ్జామ్ లో ప్రతిభ చూపిన విద్యార్థులకు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి బహుమతులు అందజేశారు. ఇటీవల ఒంగోలులో నిర్వహించిన జాతీయ స్థాయి పరీక్షలో సింగరాయకొండ శ్రీచైతన్య టెక్ నో స్కూల్ బ్రాంచ్ కి చెందిన విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చూపారు. మునగపాటి రుత్విక్ (6వ )గ్రాండ్ ప్రైజ్ లాప్టాప్ సాధించాడు. తోట నిఖిలేష్ యాదవ్ (3వ) తరగతి మొదటి బహుమతి టాబ్ సాధించాడు. ఈ సందర్భంగా మంగళవారం తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో విద్యార్థులకు మంత్రి తన చేతుల మీదుగా బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ లక్ష్మణ్, డీన్ శ్రీనివాస రావు, ప్రైమరీ ఇంచార్జి అమరవేణి, ఏవో మధుబాబు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *