తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-

సింగరాయకొండ న్యాయస్థానంలో మార్చి 14, 2026 న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడనున్నట్లు సివిల్ జడ్జి డా. వి. లీలా శ్యాం సుందరి తెలిపారు.ఈ లోక్ అదాలత్ నిర్వహణ నేపథ్యంలో న్యాయవాదులతో ప్రత్యేక సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో లోక్ అదాలత్ లక్ష్యం, కేసులను పరస్పర అవగాహనతో త్వరితగతిన పరిష్కరించే విధానం గురించి చర్చించారు. లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించుకోవడం వల్ల పక్షులకు సమయం మరియు ఖర్చు ఆదా అవుతుందని, దీర్ఘకాలిక న్యాయ ప్రక్రియ నుండి ఉపశమనం లభిస్తుందని ఆమె వివరించారు.ఈ లోక్ అదాలత్‌లో సివిల్ కేసులు, క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, బ్యాంకు రుణ కేసులు, మోటార్ వాహన ప్రమాద పరిహార కేసులు, కుటుంబ వివాదాలు తదితర కేసులను పరస్పర అంగీకారంతో సత్వరంగా పరిష్కరించుకునే అవకాశం కల్పించబడుతుందని తెలిపారు.కాబట్టి సంబంధిత పక్షులు, న్యాయవాదులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలని ఆమె కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *