తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-

కందుకూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ,వారి సతీమణి సౌజన్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీ శేషాచార్యులు నిర్వహించిన పంచాంగ శ్రవణాన్ని కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలతో కలిసి వారు ఆలకించారు.
ఈ నూతన సంవత్సరంలో:రాష్ట్రం పారిశ్రామికంగా, ఆర్థికంగా అద్భుతమైన అభివృద్ధిని సాధిస్తుందని.. వర్షాలు సమృద్ధిగా కురిసి, మన అన్నదాతలకు మేలు జరుగుతుందని..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు మరింత బలపడతాయని పంచాంగకర్తలు వెల్లడించడం ఆనందాన్ని కలిగించింది ప్రజల ఆశీస్సులు, కార్యకర్తల అండదండలతో కందుకూరు నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే నాగేశ్వరరావు తెలిపారు. ఈ ఉగాది పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని వారు ఆకాంక్షించారు.
మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన డిఎస్పీ బాలసుబ్రమణ్యం గారికి, సిఐ అన్వర్ బాషా కి, ఎస్సై శివనాగరాజు కి మరియు కూటమి నేతలకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *