తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
రాష్ట్రములో పెండింగ్ లో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కొరకు దశల వారి పోరాటానికి పిలుపునిచ్చిన బహుజన టీచర్స్ అసోసియేషన్ (బి టి ఏ) ఆదివారం డివిజన్ కార్యాలయంలో కరపత్రాన్ని ఆవిష్కరించడం అయినది. ఈ సందర్భంగా అసోసియేషన్ డివిజన్ అధ్యక్షులు మందూరి రమణయ్య మాట్లాడుతూ రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయులకు ఎన్నో సమస్యలు పరిష్కారం కాకుండా పెండింగ్లో ఉన్నాయని ఈ సమస్యల పరిష్కారం కొరకు వీటియే దశల వారి పోరాటాన్నిచ్చిందని ఈనెల 23వ తేదీ నుంచి 31వ తేదీ వరకు డివిజన్ జిల్లా కేంద్రాలలో నిరసన తెలియజేసి అధికారులకు వినతి పత్రం ఇవ్వాలని కరపత్రాన్ని ఆదివారం కందుకూరి డివిజన్ కార్యాలయంలో ఆవిష్కరించినట్టు చెప్పారు. జిల్లా అధ్యక్షులు షేక్ అబ్దుల్లా మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలైన 12వ పిఆర్సి కమిషన్ వెంటనే నియమించాలని 30% అయ్యారును వెంటనే ప్రకటించాలని పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను వెంటనే ఇవ్వాలని నియామకాలను కానీ ప్రమోషన్ కానీ రోస్టర్ కం మెరిట్ పద్ధతిలోని నియమించాలని డిఎస్సి నియమకాలను జిల్లా స్థాయిలోనే పారదర్శకంగా నిర్వహించాలని ఇక అనేక సమస్యల్ని ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవాధ్యక్షులు నల్లగొండ మోహనరావు జిల్లా ఉపాధ్యక్షుడు కల్లగుంట ఎల్లమంద డివిజన్ ప్రధాన కార్యదర్శి కొప్పులు శ్రీనివాసరావు మండల నాయకులు