తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ గారు శ్రీ పరాభవ నామ సంవత్సరం (ఉగాది) శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నూతన తెలుగు సంవత్సరాది సందర్భంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజలందరికీ అన్నీ శుభాలు కలగాలని, పండుగను కుటుంబ సభ్యులతో ఆనందంగా, ఉత్సాహంగా జరుపుకోవాలని, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలు, సిరిసంపదలతో ప్రశాంత జీవనం గడపాలన్నారు. ఉగాది పచ్చడిలోని షడ్రుచులు (అనగా తీపి, పులుపు, లవణం, కారం, చేదు మరియు వగరు) వలె మన జీవితంలో కష్టసుఖాలు, మంచి,చెడులు, లాభనష్టాలు ఉంటాయని, వాటన్నిటినీ సంయమనంతో స్వీకరిస్తూ జీవితంలో ముందుకు సాగాలని సూచించారు. ఉగాది పండుగను బంధుమిత్రులతో సాంప్రదాయబద్ధంగా సుఖసంతోషాలతో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *