తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ఉలవపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణాపురం గ్రామ కేంద్రంలో, కందుకూరు సీఐ ఆధ్వర్యంలో, స్థానిక పోలీస్ సిబ్బంది మరియు అధికారులతో కలిసి చలివేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు. వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో గ్రామ ప్రజలు, ప్రయాణికులు మరియు కార్మికుల దాహార్తిని తీర్చేందుకు ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, ప్రజల సంక్షేమమే పోలీసుల ప్రధాన లక్ష్యమని, ఇలాంటి సేవా కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. గ్రామ ప్రజలు కూడా పోలీసుల ఈ సేవా కార్యక్రమాన్ని అభినందిస్తూ, చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.పోలీసులు కేవలం చట్టవ్యవస్థ పరిరక్షణలోనే కాకుండా, సామాజిక బాధ్యతగా ప్రజల ఆరోగ్యం, సంక్షేమం కోసం కూడా కృషి చేస్తూ ఉన్నారని ఈ కార్యక్రమం ద్వారా స్పష్టమైంది.