తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
పొన్నలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామ పరిసర ప్రాంతాల్లో అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ డ్రోన్ కెమెరాలతో విస్తృత స్థాయి పర్యవేక్షణ చేపట్టారు. పొన్నలూరు ఎస్.ఐ గారి నేతృత్వంలో ఈ చర్యలు చేపట్టి, గ్రామం చుట్టూ ఉన్న అనుమానాస్పద ప్రదేశాలు, ఖాళీ స్థలాలు మరియు చెట్లతో నిండిన ప్రాంతాలను డ్రోన్ ద్వారా గమనించారు.ఈ పర్యవేక్షణలో ఎటువంటి అక్రమ కార్యకలాపాలు గమనించబడకపోయినప్పటికీ, భవిష్యత్తులో ఇలాంటి కార్యకలాపాలకు అవకాశం లేకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా ఈ డ్రోన్ నిఘా కొనసాగించబడుతుంది. ప్రజల భద్రతే లక్ష్యంగా పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, శాంతి భద్రతలను కాపాడేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.ప్రజలు ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.