తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-

జాతీయ రహదారి 16 పై ఉన్న సింగరాయకొండ మండలం దక్షిణ సింహాచలం గా పేరుగాంచిన పాత సింగరాయకొండ లో కొలువుదీరిన శ్రీ శ్రీ శ్రీ యోగానంద లక్ష్మి నారసింహ శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మి నారసింహ క్షేత్రం లో ఏప్రిల్ 2 న గిరి ప్రదక్షిణం కార్యక్రమం జరుగుతుందని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ సన్నెబోయిన శ్రీనివాసులు నాయుడు,ఆలయ కార్యనిర్వహణ అధికారి పాతకోట కృష్ణ వేణి మీడియా ప్రతినిధులకు తెలిపారు. ఈ కార్యక్రమం ఏప్రిల్ రెండవ తేదీన ఉదయం 7 గంటలకు దేవాలయం దక్షిణం మెట్ల మార్గం మండపం వద్ద నుండి ప్రారంభం అవుతుందన్నారు.
గిరి ప్రదక్షిణ కార్యక్రమం లో లక్ష్మి నారసింహస్వామి వారి భక్తులు మోత కాపులు భక్త సమాజాలు పాల్గొని విజయవంతం చెయ్యాలని వారు కోరారు. గిరి ప్రదక్షిణ కార్యక్రమం లో పాత సింగరాయకొండ, సోమరాజు పల్లి , సింగరాయకొండ, ఊళ్ల పాలెం, బంగిన పల్లి, పాకల,శానంపూడి, కనుమళ్ళ, కలికవాయ,మూలగుంట పాడు గ్రామాల తో పాటు సమీపం లోని గ్రామాల ప్రజలు పెద్ద పాల్గొని గిరి ప్రదక్షిణ విజయవంతం చెయ్యాలని వారు కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *