తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-

ఒంగోలు నగరంలో కోర్ట్ సెంటర్ రోడ్డు విస్తరణ పనులను మున్సిపల్ అధికారులు, జిల్లా కోర్ట్ పిపి మరియు బార్ అసోసియేషన్ సభ్యులతో కలిసి పరిశీలించడం జరిగినది. కోర్ట్ సెంటర్ రోడ్డు నందు 1.20 కోట్లతో చేపట్టిన రోడ్డు విస్తరణ మరియు ఇతర అభివృద్ధి పనులు పరిశీలించడం జరిగినది. కోర్ట్ లోపల క్యాంటిన్, SBI బ్యాంక్, అసోసియేషన్ కార్యాలయం వారం రోజుల్లలో కాలి చేయాలి అన్ని తెలియజేసారు. రోడ్డు విస్తరణకు దయచేసి మీ అందరూ సహకారం అందించాలి అన్ని బార్అసోసియేషన్ సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడటం జరిగినది.ఇప్పటకే 6 నెలలు గడిచిన వస్తరణ పనులు ముందుకు సాగకపోవడంపై మున్సిపల్ అధికారులపై మండిపడ్డారు. ఈ సందర్బంగా జనార్దన్ గారు అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం.. అవినీతికి తావులేకుండా అధికార యంత్రాంగం పనిచేయాలని, ప్రజలకు మంచి పనులు చేసినప్పుడే ప్రభుత్వానికి, అధికారులకు మంచి పేరువస్తుందని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు తెలిపారు. అనుకున్న సమయానికంటే ముందే పూర్తి చేయాలని వారికి సూచించారు. నాణ్యతా ప్రమాణాలకు తగినట్గుగా పనులు జరిగేలా చూడాలని, నిర్లక్ష్యం, అవినీతికి చోటులేకుండా సకాలంలో అభివృద్ధిపనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని దామచర్ల అధికారుల్ని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోర్ట్ పిపి అజయ్ బాబు, అడ్వకేట్ బొడ్డు భాస్కర్,కమీషనర్ రాంభూలరెడ్డి గారు, ME ఐసయ్య, విద్యుత్ అధికారి DE హరిబాబు , నగర టీడీపీ అధ్యక్షులు బండారు మదన్ , టీడీపీ నాయకులు, అధికారులు మరియు తదితరులు పాల్గొన్నడం జరిగినది.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *