తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-

సింగరాయకొండ మండలంలో 19-11-2024 తేదీన సింగరాయకొండ ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ లో నమోదైన మద్యం అక్రమ రవాణా కేసులో నిందితుడికి కోర్టు ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. సోమరాజుపల్లి గ్రామం, అవులవారిపాలెంకు చెందిన సాదం కొండయ్య అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ చట్టంలోని సెక్షన్ 34(ఏ) కింద నేరానికి పాల్పడినట్లు విచారణలో తేలింది.సోమవారం సింగరాయకొండ ప్రథమ శ్రేణి న్యాయమూర్తి జ్యూడిషల్ మేజిస్ట్రేట్ అఫ్ ఫస్ట్ క్లాస్ డాక్టర్ వి. లీలా శ్యామ్ సుందరి ఈ కేసులో తుది తీర్పు వెలువరించారు. నేరం రుజువు కావడంతో నిందితుడికి ఒక సంవత్సరం సాధారణ జైలు శిక్ష మరియు 3,000 రూపాయల జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ నిందితుడు జరిమానా చెల్లించని పక్షంలో, అదనంగా మరో నెల రోజుల పాటు జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు.అనంతరం నిందితుడిని శిక్ష అమలు నిమిత్తం ఒంగోలు జిల్లా జైలుకు తరలించాలని కోర్టు అధికారులను ఆదేశించింది.ప్రొసీక్యూషన్ తరుపున కేసును పబ్లిక్ ప్రొసీక్యూటర్ డి వరకుమారి వాదించగా,సింగరాయకొండ సబ్ ఇన్స్పెక్టర్ బి. మహేంద్ర దర్యాప్తు చేశారు.హెడ్ కానిస్టేబుల్ పి. శ్రీహరి సహకరించి, సాక్షులను సకాలంలో కోర్టులో ప్రవేశపెట్టారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *