తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-

చదువు సంస్కారం, క్రమశిక్షణ, కఠోర శ్రమ సమయ పాలన అలవాటు చేసుకుంటే విద్యలోనే కాదు దీనిలో అయినా ఉత్తమ ఫలితాలు సాధించి తల్లిదండ్రులు, జన్మ భూమి కి గౌరవం తెచ్చి పెట్టచని ఇంటర్ పరీక్షా ఫలితాలలో రాష్ట్ర ద్వితీయ, జిల్లా ప్రథమ స్థానం పొందిన ఆర్రిబోయిన భానుశ్రీ ఆదర్శంగా నిలిచింది. చిన్న నాటి నుండి తండ్రి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఆర్రి బోయిన రాంబాబు ఈ ఇచ్చిన సంస్కారం, ఆయన పెంపకం నా ఉన్నతికి కారణం అని చెప్పడం అభినందనీయం. ఇదే విధంగా ప్రతి ఉపాధ్యాయుడు, చదువుకున్న వారు వారి తో పాటు ఆగ్రమ పిల్లలకి ఉత్తమ సంస్కారం విద్యాబుద్ధులు నేర్పాలని ఆమె కోరుకున్నారు.
ఈ రోజు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను 991 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో ప్రధమ ర్యాంక్ మరియు రాష్ట్ర స్థాయి ర్యాంక్‌ను సాధించడం నా అదృష్టం అని భానుశ్రీ పేర్కొంది. తమ సాటి ఉపాధ్యాయుడు రాంబాబు కుమార్తె సాధించిన విజయం పై సహచర ఉపాధ్యాయులు
హర్షం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడైన రాంబాబు గారి కుమార్తె అర్రిబోయిన భాను శ్రీ ఈ విశిష్ట విజయాన్ని సాధించడం పట్ల వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు అభినందనలు తెలియజేశారు. భానుశ్రీ కి పుష్పగుచ్ఛాలతో అభినందనలు తెలుపుతూ, భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
భానుశ్రీ చదివిన శ్రీ సాయిరాం జూనియర్ కాలేజ్, ఒంగోలు కళాశాల యాజమాన్యాన్ని కూడా ఈ సందర్భంగా అభినందించారు.
అభినందనలు తెలిపిన వారిలో భానుశ్రీ తాత వేల్పుల సింగయ్య, సీనియర్ తెలుగుదేశం నాయకుడు దామచర్ల పూర్ణ చంద్ర రావు, చిన్నాన్న సుధాకర రావు, మామయ్య వెంకట్రావు, సర్వ శిక్ష అభియాన్ ఎంఐఎస్ కోఆర్డినేటర్ మసనం జాలరత్నం ,డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్స్ చైర్మన్ మర్రిబోయిన శ్రీనివాసులు, ఉపాధ్యాయ సంఘం నాయకులు అంబటి బ్రహ్మయ్య, నూకసాని వెంకటేశ్వర్లు, శీలం ప్రసాదరావు, అంబటి ప్రసాదు, సుల్తాన్ భాష , సమరసత సేవ ఫౌండేషన్ సభ్యులు, సీనియర్ జర్నలిస్ట్ సనాతన ధర్మ కార్యకర్త డా పెట్లూరి వేంకటేశ్వర రావు, అర్రిబోయిన రాంబాబు సహచరులు మిత్రులు బంధువులు తదితరులు అభినందించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *