తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

గిద్దలూరు టౌన్‌లోని ఏబీఎం పాలెం ప్రాంతంలో కర్డన్ అండ్ సెర్చ్ (Cordon & Search) ఆపరేషన్ నిర్వహించారు. ఈ ప్రత్యేక తనిఖీలలో అనుమానాస్పద కార్యకలాపాలపై దృష్టి సారించి, వాహనాలు మరియు వ్యక్తులను సమగ్రంగా తనిఖీ చేశారు.ఈ ఆపరేషన్‌లో భాగంగా సరైన పత్రాలు లేని మరియు అనుమానాస్పదంగా ఉన్న 15 బైకులు, 3 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.
ప్రాంతంలో శాంతి భద్రతలను కాపాడడం, నేరాలను అరికట్టడం లక్ష్యంగా ఇలాంటి ఆపరేషన్లు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించి, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలపై సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *