తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం మరియు మార్కాపురం పోలీస్ :-
ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల్లో జూద కార్యకలాపాలపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా సాగుతున్న తనిఖీల్లో భాగంగా, రాయవరం మరియు వెల్లటూరు గ్రామాల్లో నిర్వహించిన దాడుల్లో మొత్తం 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.మార్కాపురం రూరల్: రాయవరం గ్రామ పరిధిలోని కొత్తముక్క ప్రాంతంలో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో మార్కాపురం రూరల్ పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో 5 మందిని పట్టుకుని, వారి వద్ద నుండి రూ.3,400/- నగదును స్వాధీనం చేసుకున్నారు.పొన్నాలూరు: ప్రకాశం జిల్లా వెల్లటూరు ఎస్సీ కాలనీ శివారులో సాగుతున్న జూద స్థావరంపై పొన్నాలూరు పోలీసులు దాడి నిర్వహించారు. ఇక్కడ 4 మందిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి రూ.1,650/- నగదుతో పాటు 5 మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు.ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ.. జూదం, బెట్టింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాల వల్ల అనేక కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గ్రామాల్లో ఎక్కడైనా ఇలాంటి పనులు జరుగుతుంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని వారు తెలిపారు.
