తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం:-

విడవలూరు మండలం దండిగుంట గ్రామంలో అనారోగ్య కారణాలతో మృతి చెందిన వరిణి వ్యవసాయ సహకార సొసైటీ సభ్యురాలు కుడుముల రమణమ్మ, మరో తెలుగుదేశం పార్టీ కార్యకర్త కుడుముల రాము కుటుంబాలను కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు పరామర్శించారు. దండిగుంట గ్రామంలోని మృతుల నివాసాలకు వెళ్లిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు రమణమ్మ మరియు రాము చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి, మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కష్టకాలంలో పార్టీ మరియు తాను అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రమణమ్మ సొసైటీ సభ్యురాలిగా చేసిన సేవలను, రాము పార్టీ పట్ల చూపిన నిబద్ధతను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *