తొలి శుభోదయం న్యూస్ దర్శి:-

దర్శి టీడీపీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ గారి చొరవతో, దర్శి తహసీల్దార్ ఎం. శ్రవణ్ కుమార్ పర్యవేక్షణలో, దర్శి పట్టణంలోని ప్రస్తుత MRO కార్యాలయ ప్రాంగణంలో ఖాళీగా ఉన్న పాత తహసీల్దార్ కార్యాలయ భవనంలో గ్రంథాలయం ఏర్పాటు పనులను జాయింట్ కలెక్టర్ కల్పన కుమారి గారితో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా, త్వరలోనే గ్రంథాలయాన్ని ప్రారంభించనున్నట్లు డా. గొట్టిపాటి లక్ష్మీ తెలిపారు.క్లాక్ టవర్ సెంటర్‌కు సమీపంలో, అందరికీ సులభంగా చేరుకునే ప్రభుత్వ స్థలంలో గ్రంథాలయం ఏర్పాటు చేయడం శుభపరిణామమని దర్శి ప్రజలు అభిప్రాయపడి, డా. గొట్టిపాటి లక్ష్మీ కి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ జామ్ సన్, దర్శి మున్సిపల్ కమిషనర్ కె. అర్జున్ రావు, దర్శి మరియు కురిచేడు మండలాల టీడీపీ అధ్యక్షులు మారెళ్ల వెంకటేశ్వర్లు, పిడతల నెమిలయ్య, అలాగే నియోజకవర్గంలోని వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ నాయకులు, కూటమి శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *