తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

జిల్లాలో ఇటీవల చోటుచేసుకుంటున్న దొంగతనాల నేపథ్యంలో దేవాలయాల భద్రతను మరింత బలోపేతం చేసేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు సర్కిల్ పరిధిలోని గ్రామాల దేవాలయ ధర్మకర్తలు, పూజారులతో సమావేశం నిర్వహించి భద్రతా చర్యలపై సమగ్రంగా చర్చించారు.ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ దేవాలయాల్లో పూజా సామగ్రి, నగలు, హుండీ నగదు వంటి విలువైన వస్తువులపై దృష్టి పెట్టి దొంగతనాలు జరుగుతున్నాయని, అందువల్ల ప్రతి దేవాలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అత్యవసరమని సూచించారు. సీసీ కెమెరాల ద్వారా అనుమానాస్పద కదలికలను గుర్తించి ముందస్తుగా చర్యలు తీసుకోవచ్చని తెలిపారు.అదేవిధంగా దేవాలయాల వద్ద రాత్రి సమయంలో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేయాలని, హుండీలను క్రమం తప్పకుండా ఖాళీ చేసి సురక్షితంగా ఉంచాలని సూచించారు. గ్రామస్థులు, భక్తులు కూడా అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.సమావేశంలో పాల్గొన్న పూజారులు, ధర్మకర్తలు పోలీసుల సూచనలను పాటిస్తూ భద్రతా చర్యలను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. దేవాలయాల రక్షణలో సమాజం మొత్తం భాగస్వామ్యం కావాలని పోలీసులు పిలుపునిచ్చారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *