తొలి శుభోదయం న్యూస్ పొన్నలూరు:-

పొన్నలూరు మండలం ముప్పాళ్ళ హైస్కూల్ లో సైన్స్ టీచర్ గా పని చేస్తున్న ఆకురాతి బలరామకృష్ణ పదవీ విరమణ సభ… కందుకూరు పట్టణంలోని జనార్ధన స్వామి కళ్యాణ మండపంలో ఆదివారం మధ్యాహ్నం జరిగింది. కందుకూరు MLA ఇంటూరి నాగేశ్వరరావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాట్లాడుతూ… ఆకురాతి బలరామకృష్ణ, ఉపాధ్యాయ వృత్తికి వన్నెతెచ్చారని ప్రశంసించారు. పిల్లలకు పాఠాలు బోధించడంలోనూ, సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడంలోనూ బలరామకృష్ణ ముందుంటారని కొనియాడారు. తనకు చేతనైనంతలో విద్యాభివృద్ధికి సహకరించడం గొప్ప విషయమన్నారు. అందుకే జిల్లా మరియు రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు వెతుక్కుంటూ వచ్చాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
అనంతరం బలరామకృష్ణను ఎమ్మెల్యే నాగేశ్వరరావు ఘనంగా సత్కరించి, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన శేషజీవితం సంతోషంగా గడవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బలరామకృష్ణ బంధువులు, పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *