తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-

సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండ పంచాయతీ మల్లికార్జున్ నగర్ ప్రాథమిక పాఠశాలను ఎస్టీ కమిషన్ చైర్మన్ చోళ్ల బొజ్జి రెడ్డి పరిశీలించారు. పాఠశాల పరిసరాలను వీక్షించి విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్టి కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ విద్యార్థులకు ఆధార్ కార్డులు లాంటి సమస్యలు ఉన్నాయని సంబంధిత అధికారులకు తెలిపి త్వరగతిన పూర్తి చేస్తామని చెప్పారు. అనంతరం విద్యార్థులతో కలిసి పాటలు పాడి చిన్నారులను అలరించారు. ఈ సందర్భంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మించల బ్రహ్మయ్య, ఎస్టి నాయకులు లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *