తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-

తీర ప్రాంతం రైల్వే కూడలి గ్రామం లో పేద ప్రజలకు, ప్రయాణీకులు, అభాగ్యుల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్న కాంటీన్ ఎంతగానో ఉపయోగ పడుతుందని దాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రజలు ముందుకు రావాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి డా డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పిలుపు ఇచ్చారు. నాడు సంకల్పించిన అన్న కాంటీన్ కల నేడు నెరవేరి బుధవారం ప్రశ్నించిన సందర్భంగా ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా సింగరాయకొండ మండల కేంద్రం బంగ్లా రోడ్డు లో ప్రభుత్వ ఉన్నత శ్రేణి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపం లో ప్రభుత్వం ఏర్పాటు చెందిన అన్న కాంటీన్ ని మంత్రి డోలా ప్రారంభించి భోజనం వడ్డించడం కాకుండా అక్కడే భోజనం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికనుండి ఆయన మాట్లాడుతూ దశాబ్దం క్రితం సంకల్పించి బొమ్మల కూడలి వద్ద నిర్మాణం పనులు చేపట్టి కొంత మేరకు నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. అయితే ప్రభుత్వం మారడం తో అనిర్మాణ పనులు అటకెక్కాయన్నారు. అయితే కూటమి ప్రభుత్వం చొరవతో తిరిగి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని బంగ్లా రోడ్డు ( కందుకూరు రోడ్డు) లో ఉన్నత శ్రేణి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో నిర్మాణ పనులు చేపట్టి పూర్తి చేయడం జరిగిందన్నారు. అప్పుడు చేసిన సంకల్పం ఇప్పుడు నెరవేరడం ఆనందాన్ని కలిగించిందన్నారు. ఈ కాంటీన్ లో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, దీన్ని ఉపయోగించుకునే వారి సంఖ్య పెరిగితే సాయింత్రం కూడా అల్పాహారం, భోజనం ఏర్పాటు గురించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇస్కాన్ సంస్థ ,( హేర్ కృష్ణ సంస్థ) వారి సహకారం తో అన్నకాంటీన్ లు నిర్వహణ జరుగుతుందన్నారు. ముందుగా ప్రయత్నించిన విధంగా రోజు వారి పట్టిక ప్రకారం మెను ఉంటుందన్నారు.ఈ కార్యక్రమం లో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి. మండల రెవెన్యూ అధికారి ఎన్ వి బి రాజేష్,అభివృద్ధి అధికారి జయ మణి , కూటమి పార్టీల నాయకులు, పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *