తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

పొగాకు కార్మికుల భద్రతను ముఖ్యంగా పరిగణనలోకి తీసుకుని, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సింగరాయకొండ సీఐ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలు మరియు మహిళల రక్షణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో కార్మికులకు రోడ్డు ప్రమాదాల నివారణకు పాటించాల్సిన ట్రాఫిక్ నియమాలు, హెల్మెట్ వినియోగం ప్రాముఖ్యత, అతివేగం వల్ల కలిగే ప్రమాదాలు, మద్యం సేవించి వాహనం నడపడం వల్ల జరిగే తీవ్ర పరిణామాలపై విపులంగా అవగాహన కల్పించారు.అలాగే మహిళలపై జరిగే నేరాలను అరికట్టేందుకు చట్టపరమైన చర్యలు, స్వీయ రక్షణ పద్ధతులు, అనుమానాస్పద ఘటనలను వెంటనే పోలీసులకు తెలియజేయాల్సిన అవసరాన్ని వివరించారు. ప్రజల సహకారంతోనే సురక్షితమైన, నేరరహిత సమాజం నిర్మాణం సాధ్యమని సీఐ గారు పేర్కొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *