తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ పొన్నలూరు:-

కందుకూరు డీఎస్పీ పొన్నలూరు పోలీస్ స్టేషన్‌ను సందర్శించి స్టేషన్ పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా కేసు డైరీలు, కేసుల పురోగతి, స్టేషన్ రికార్డులను సవివరంగా పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలన్నారు.స్టేషన్ నిర్వహణలో నిబంధనలు కచ్చితంగా పాటించాలని, రికార్డుల నిర్వహణను సక్రమంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. ప్రజల ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తూ పారదర్శకంగా పనిచేయాలని, పోలీస్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని తెలిపారు.అలాగే శాంతి భద్రతల పరిరక్షణకు పహారా, విజిబుల్ పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేయాలని, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పనితీరును మరింత మెరుగుపరచేందుకు అవసరమైన సూచనలు అందించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *