తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

తేదీ 20.04.2026 న త్రిపురాంతకం మండలం, గొల్లపల్లి గ్రామానికి చెందిన చెన్నుబోయిన సౌభాగ్యం (భూమయ్య భార్య), వయసు 29 సంవత్సరాలు, రాజస్థాన్ స్వీట్ షాప్ మరియు బేకరీ సమీపంలో తన పర్సును పోగొట్టుకుంది. వెంటనే ఆమె పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసింది.ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు స్పందించి, సమీప ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోయిన పర్సును గుర్తించి, అందులో ఉన్న రూ.10,000 నగదుతో సహా బాధితురాలికి తిరిగి అప్పగించారు.పోలీసుల వేగవంతమైన చర్యలకు బాధితురాలు కృతజ్ఞతలు తెలిపింది. ప్రజల ఆస్తి రక్షణలో పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటారని అధికారులు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *