తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

ఎన్.జి.పాడు మండలం ఉప్పుగుండూరు గ్రామంలో CASO (Cordon & Search Operation) నిర్వహించబడింది. గంజాయి నిల్వలు మరియు అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించి ఇళ్లలో సమగ్ర తనిఖీలు చేపట్టారు.ఈ ఆపరేషన్‌లో మద్దిపాడు పోలీస్ స్టేషన్ SI, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది సంయుక్తంగా పాల్గొన్నారు. గ్రామంలోని అనుమానాస్పద ప్రదేశాలు, ఇళ్లను పరిశీలించి గంజాయి నిల్వలు ఉన్నాయా లేదా అన్నదానిపై విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.ఈ ప్రాంతంలో మత్తు పదార్థాల వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించడం లక్ష్యంగా పోలీసులు కృషి చేస్తున్నారు. ప్రజలు సహకరించి, ఎక్కడైనా గంజాయి లేదా ఇతర అక్రమ కార్యకలాపాలు గమనించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *