తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

ప్రజా సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు సోమవారం ఒంగోలు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో “మీకోసం” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదిదారులతో జిల్లా ఎస్పీ గారు మరియు పోలీసు అధికారులు ఫిర్యాదిదారులతో ముఖాముఖిగా మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, ఉద్యోగ సంబంధిత మరియు ఆన్‌లైన్ మోసాలు, భూ వివాదాలు తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులను ఫిర్యాదిదారులు స్వేచ్ఛగా వినిపించారు. జిల్లా ఎస్పీ గారు ఫిర్యాదులను సవివరంగా పరిశీలించి, ప్రతి సమస్యపై సానుకూలంగా స్పందించిన జిల్లా ఎస్పీ గారు చట్టప్రకారం చర్యలు తీసుకోని త్వరితగతిన న్యాయం అందిస్తామని భరోసా కల్పించారు. ఆయా పోలీస్ స్టేషన్ అధికారులతో జిల్లా ఎస్పీ గారు మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని, అలాగే ఫిర్యాదులపై చేపట్టిన చర్యలపై నివేదికను సమర్పించాలని జిల్లా ఎస్పీ గారు ఆదేశించారు. “మీకోసం” కార్యక్రమంలో అందిన ప్రతి ఫిర్యాదును సత్వరంగా పరిష్కరించి, బాధితులకు న్యాయం కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను సూచించారు.ఫిర్యాదు చేయడానికి వచ్చే వారిలో కొంత మంది వృద్ధులు, నడవలేని స్థితిలో ఉండేవారు ఫిర్యాదు చేయడానికి వస్తూ ఉంటారని, అలా వచ్చిన వారికి మర్యాదపూర్వకంగా వారి సమస్యలను విని సత్వర న్యాయం అందిస్తామని భరోసా వారిలో కలిగించాలని సిబ్బందికి తెలియజేశారు. జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలేని ప్రజలు తమ ఫిర్యాదులను స్థానిక పోలీస్ స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాలు, సబ్-డివిజన్ కార్యాలయాలలో కూడా సమర్పించవచ్చని ఎస్పీ గారు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఒంగోలు మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీ పి.శ్రీధర్, ఒంగోలు రూరల్ సీఐ యం. శేషగిరి రావు, కందుకూరు సిఐ షైక్ అన్వర్ బాషా, సంతమాగులూరు సీఐ పి.శేషగిరి రావు, ప్యానెల్ అడ్వొకేట్ బి.బాలాజీ సింగ్, సమస్యల పరిష్కార వేదిక ఎస్సై జనార్దన్ రావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *