ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంకు 39 ఫిర్యాదులు
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్ :-
ఫిర్యాదిదారుల సమస్యలను పరిష్కరించేందుకు సోమవారం మార్కాపురం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., ఆదేశాల మేరకు మార్కాపురం డిఎస్పీ యు. నాగరాజు ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు “ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం)” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదిదారులతో పోలీస్ అధికారులు ముఖాముఖిగా మాట్లాడి, వారి సమస్యలను విని వివరాలు అడిగి తెలుసుకున్నారు.కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, ఉద్యోగ సంబంధిత / ఆన్‌లైన్ మోసాలు, భూ వివాదాలు తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులను ఫిర్యాదిదారులు స్వేచ్ఛగా విన్నవించారు. ఫిర్యాదిదారుల సమస్యలను సవివరంగా విని, సానుకూలంగా స్పందించిన అధికారులు చట్టపరమైన విధానాల ద్వారా త్వరితగతిన న్యాయం అందిస్తామని భరోసా కల్పించారు.సంబంధిత పోలీస్‌స్టేషన్ అధికారులతో మాట్లాడించి, తగిన చర్యలు తీసుకోవాలన్నారు. మీకోసం కార్యక్రమంలో వచ్చిన ప్రతి ఫిర్యాదును సత్వరంగా పరిష్కరించి, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలేని ప్రజలు తమ ఫిర్యాదులను స్థానిక పోలీస్ స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాలు, సబ్-డివిజన్ కార్యాలయాలలో కూడా సమర్పించవచ్చని ఎస్పీ తెలిపారు.ఈ కార్యక్రమంలో మార్కాపురం సీఐ సుబ్బారావు, పామూరు సీఐ వినోద్ కుమార్, కంభం సీఐ మల్లికార్జున రావు, ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
