తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించుటకు సోమవారం నిర్వహించే “ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీ కోసం)” కార్యక్రమాన్ని జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ గారు నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదిదారుల వ్రాతపూర్వక వినతులను జిల్లా ఎస్పీ మరియు పోలీస్ అధికారులు స్వీకరించి, వారితో ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని, వాటిని చట్టపరిధిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు.అందిన ఆయా ఫిర్యాదులపై సంబంధిత పోలీస్‌స్టేషన్ అధికారులతో ఫిర్యాదుదారుల వివరాలు తెలియజేసి, తక్షణ విచారణ చేపట్టి, చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోని భాధితులకు న్యాయం అందించాలని, జవాబుదారీతనంతో ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాలని, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఫిర్యాదులపై అలసత్వం వహించకుండా నిర్ణీత గడువులో ఫిర్యాదులు పరిష్కారించాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. ఫిర్యాదు చేయడానికి వచ్చే వారిలో వృద్ధులు, నడవలేని స్థితిలో ఉన్నవారు కూడా ఉంటారని గుర్తించిన జిల్లా ఎస్పీ , అటువంటి వారికి మర్యాదపూర్వకంగా స్పందించి వారి సమస్యలను శ్రద్ధగా విని, సత్వర న్యాయం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. అవసరమైతే సంఘటన స్థలాన్ని సందర్శించి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలేని ప్రజలు తమ ఫిర్యాదులను స్థానిక పోలీస్ స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాలు, సబ్-డివిజన్ కార్యాలయాలలో కూడా సమర్పించవచ్చని ఎస్పీ గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్కువగా సివిల్/భూ/ఆర్థిక తగాదాలు, అత్తరింటి వేదింపులు,ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలు, చీటింగ్ మొదలగు ఫిర్యాదులు ఉన్నాయి.ఈ కార్యక్రమంలో ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, అద్దంకి రూరల్ సీఐ మల్లికార్జున రావు, ఒంగోలు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ జగదీష్, గుడ్లూరు సీఐ నరేష్ కుమార్, ప్యానెల్ అడ్వొకేట్ బి.బాలాజీ సింగ్, సమస్యల పరిష్కార వేదిక ఎస్సై జనార్దన్ రావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *