దర్శి పట్టణంలోని టిడిపి కార్యాలయంలో నిర్వహించిన “ప్రజా దర్బార్” కార్యక్రమంలో దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పాల్గొని ప్రజలు మరియు పార్టీ కార్యకర్తల నుండి వినతులు స్వీకరించారు.ప్రజల సమస్యలను ఆలకించి సంబంధిత అధికారులతో చర్చించి సుమారు 90% సమస్యలను తక్షణమే పరిష్కరించడం కార్యక్రమానికి ప్రత్యేకతగా నిలిచింది.ముఖ్యంగా రెవెన్యూ మరియు రీ-సర్వే సమస్యలపై వచ్చిన అర్జీలను వేగంగా, సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని అధికారులకు సూచనలు ఇచ్చారు. “ప్రజల చెంతకే పాలనను తీసుకువెళ్లడం నా లక్ష్యం. ప్రతి ఒక్కరి సమస్యకు పరిష్కారం దొరికే వరకు నా కృషి ఆగదు” అని Dr. గొట్టిపాటి లక్ష్మీ స్పష్టం చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *