తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

ప్రజల నుండి వచ్చే వివిధ రకాల ఫిర్యాదులకు పరిష్కారం కల్పించాలనే లక్ష్యంతో మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు మార్కాపురం డీఎస్పీ యు. నాగరాజు మరియు పోలీస్ అధికారులు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో “మీకోసం” (PGRS) కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదులను పోలీస్ అధికారులు స్వీకరించి, ఫిర్యాదుదారులతో ముఖాముఖీగా మాట్లాడి వారి సమస్యలను వివరంగా తెలుసుకున్నారు. అందిన ప్రతి ఫిర్యాదుపై చట్టప్రకారం సమగ్ర విచారణ చేపట్టి సత్వర పరిష్కారం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని బాధితులకు భరోసా కల్పించారు. అదేవిధంగా అందిన ఫిర్యాదుల వివరాలను సంబందిత పోలీస్ స్టేషన్ అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి త్వరితగతిన చట్ట ప్రకారం విచారణ జరిపి భాదితులకు న్యాయం అందించేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా భూ వివాదాలు, ఉద్యోగ మోసాలు, కుటుంబ కలహాలు, ఆర్థిక మోసాలు, చీటింగ్ కేసులు మరియు ఇతర సమస్యలపై ప్రజలు ఫిర్యాదులు చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలేని ప్రజలు తమ ఫిర్యాదులను స్థానిక పోలీస్ స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాలు, సబ్-డివిజన్ కార్యాలయాలలో కూడా సమర్పించవచ్చు. ఈ కార్యక్రమంలో పొదిలి సీఐ రాజేష్ కుమార్, గిద్దలూరు రూరల్ సీఐ రామకోటయ్య, కంభం సీఐ మల్లికార్జున రావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *