తొలి శుభోదయం న్యూస్ ఉలవపాడు:-
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉలవపాడు మండలం చాకిచెర్ల శ్రీశ్రీ నగర్ లో, ప్రేమ జ్యోతి మినిస్ట్రీ సంఘం ఆధ్వర్యంలో అందమహిళల ఆధ్వర్యంలో 08.03.2026 న కార్యక్రమం నిర్వహించినారు, అందమహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షులు గిడుగు జ్యోతి అధ్యక్షతన కార్యక్రమ నిర్వహించారు .రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్, బాపట్ల అన్నమ్మ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కట్టా గౌరీ, సహాయ కార్యదర్శి యేసు దయా,రాష్ట్ర ట్రెజరర్ ఎస్తేరు రాణి ,ఈ కార్యక్రమంలో పాల్గొని దివ్యాంగుల సమస్యల గురించి అంతర్జాతీయ మహిళా దినోత్సవ విశిష్టత గురించి ప్రసంగించారు,. 60 మంది అంద మహిళలు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా అందమహిళ అధ్యక్షురాలు జ్యోతి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక వృద్ధాప్య మహిళల కు,20 మందికి, వారి యొక్క సంఘం ఆధ్వర్యంలో చీరలు పంపిణీ చేశారు. చాకిచెర్ల గ్రామానికి చెందిన సుదర్శి వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమం నిర్వహ ణ చేయడం జరిగినది .కావలి రూరల్ బ్లైండ్స్ అధ్యక్షుడు రాజశేఖర్ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. చాకిచెర్ల స్థానిక ఉపాధ్యాయుడు భాస్కరరావు అంతర్జాతీయ మహిళా విశిష్టతను గురించి తెలియజేస్తూ దివ్యాంగ మహిళలు ఇలాంటి కార్యక్రమంలో పాల్గొని మా గ్రామానికి రావటం గర్వకారణం అని తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో మరియమ్మ, రమాదేవి. , రూపారాణి సుదర్శి శ్రీనివాసులు, పాల రాజు, నాని,సతీష్,చెన్నకేశవులు, పాల్గొన్నారు.
