తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు సంయుక్తంగా బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవనాన్ని అరికట్టేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులు, సామాజిక అసౌకర్యం మరియు శాంతి భద్రతల సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు చేపట్టారు.ఈ సందర్భంగా పట్టణ పరిసర ప్రాంతాలు, కాలనీలు, రోడ్ల పక్కన, ఖాళీ ప్రదేశాలలో మద్యం సేవించే ప్రాంతాలను గుర్తించి పూర్తిగా శుభ్రపరిచారు. అలాగే అక్కడ మద్యం సేవిస్తున్న వ్యక్తులను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.పోలీసులు ప్రజలకు సూచిస్తూ, బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం చట్ట విరుద్ధమని, అలాంటి చర్యలు సామాజిక శాంతిని భంగం కలిగిస్తాయని తెలిపారు. ఇటువంటి అక్రమ కార్యకలాపాలను గమనించిన ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
ఈ కార్యక్రమం ద్వారా ప్రాంతంలో శాంతి భద్రతలు మెరుగుపడటంతో పాటు, ప్రజలకు సురక్షిత వాతావరణం కల్పించడమే లక్ష్యంగా పోలీసులు కృషి చేస్తున్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *