తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
బహుజన జాగృతి సమితి ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి ఉత్సవాలు ST కాలనీ (తాతయ్య కాలనీ), పాత సింగరాయకొండలో ఘనంగా నిర్వహించడం జరిగింది. బహుజన జాగృతి సమితి మండల అధ్యక్షులు దీవెనకుమార్ సభకు అధ్యక్షత వహించి అంబేద్కర్ జాతికి చేసిన సేవలను వివరించారు.
సభలో రాష్ట్ర అధ్యక్షులు రాజశేఖర్ గారు మాట్లాడుతూ అంబేద్కర్ జీవితం, చదువు, ఉద్యోగం, జాతి విముక్తి కోసం ఆయన చేసిన కృషిని, మహిళా విముక్తి, హిందూకోడ్ బిల్లు, కార్మిక సంక్షేమం కోసం అంబేద్కర్ చేసిన ఉద్యమాలను వివరించడం జరిగింది.ముఖ్య అతిథి అంకయ్య ప్రసాద్ (రిటైర్డ్ టీచర్)గారు అంబేద్కర్ పాటు బుద్ధుడు నుండి కాన్షీరాం మొదలగు బహుజన మహానీయుల చేసిన కృషిని కొనియాడారు. బహుజన జాగృతి సమితి నాయకులు అరుణ్ గారు, గ్రామ ప్రజలు, మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొని అంబేద్కరయ్యకు ఘనంగా నివాళులు తెలియజేశారు. .
