తొలి శుభోదయం న్యూస్ దర్శి:-

దర్శి మండలం చందలూరు గ్రామ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో 14 ఏళ్ల బాలికలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ కోసం ఉచిత HPV వ్యాక్సిన్ కార్యక్రమాన్ని దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ శుక్రవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా డా. లక్ష్మీ మాట్లాడుతూ మహిళలను గర్భాశయ క్యాన్సర్ ముప్పు నుంచి రక్షించడంలో HPV టీకా ఎంతో ముఖ్యమని తెలిపారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ , రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ వ్యాక్సిన్‌ను ఉచితంగా అందుబాటులోకి తీసుకువచ్చారని చెప్పారు.సాధారణంగా రూ.4000 వరకు విలువ చేసే ఈ వ్యాక్సిన్‌ను ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నందున 14 సంవత్సరాలు నిండిన బాలికలు తప్పకుండా టీకా తీసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, వైద్యులు, ANMs, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *