తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-

కందుకూరు పట్టణంలోని పామూరు రోడ్డు నందు ఉన్న బి.ఆర్ ఆక్స్ ఫర్డ్ ఒలంపియాడ్ పాఠశాలలో ముందస్తు రంజాన్ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముస్లిం విద్యార్థులు మత పెద్ద సమక్షంలో ఖురాన్ పఠనం గావించారు. తదుపరి అందరికీ మిఠాయిలు,హలీం పంచిపెట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బి.ఆర్ ఆక్స్ ఫర్డ్ విద్యాసంస్థల చైర్మన్ ఉన్నం భాస్కర రావు మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్ మాసం ఆత్మ నిగ్రహం, దానధర్మాలు, మరియు భక్తికి నిదర్శనం అన్నారు. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యాసంస్థల డైరెక్టర్ జి.బాల భాస్కరరావు మాట్లాడుతూ.. రంజాన్ మనకు శాంతి,సోదరభావం, క్షమా గుణం, సహనాన్ని బోధిస్తుందని.. మనుషులంతా ఈ సద్గుణాలను అలవర్చుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల కరస్పాండెంట్ బండి వెంకటేశ్వర్లు, డైరెక్టర్ బెజవాడ నరేంద్రబాబు, పాఠశాల డీన్, ప్రిన్సిపాల్స్, తదితర ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *