తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు అంబేద్కర్ విగ్రహ కూడలి వద్ద సామ్రాట్ మౌర్య అశోకుని 2330వ జయంతి సభ ఘనంగా జరిగింది.
ధమ్మచక్ర ఫౌండేషన్, బహుజన టీచర్స్ అషోసియేషన్, జాషువా సాహిత్య సాంస్కృతిక సంస్థ సంయుక్తంగా నిర్వహించిన సభకు దాసరి వీరనారాయణ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా పాల్గొన్న ఉపాసక గాండ్ల హరిప్రసాద్ మాట్లాడుతూ క్రీ.పూ 304లో జన్మించిన అశోకుడు క్రీ. పూ 273 లో పట్టాభిషక్తుడై 42 ఏళ్ళపాటు సుదీర్ఘకాలం పరిపాలన సాగించిన ఏకైక చక్రవర్తి అని అన్నారు. కళింగ యుద్ధం తరువాత బౌద్ధాన్ని స్వీకరించి దమ్మాశోకుడుగా మారి ప్రజా సంక్షేమానికి పది శాసనాలతో నూతన సంస్కృ తిని అందించాడు. అదే నేడు రాజ్యాంగంలో పొందు పరిచబడిందినది అని అన్నారు. ప్రముఖ అంబేద్కర్ రిస్ట్ గేరా చిరంజీవి మాట్లాడుతూ నేడు దళిత,బహుజనులను మనువాదం పూర్తిగా అణచివేస్తున్నాదని, ఆ అణచివేతను ఎదిరిస్తూ పోరాడవలసిన సమయం వచ్చిందని తెలిపారు. సామాజికవేత్త పాలేటి కోటేశ్వరరావు మాట్లాడుతూ మతాలన్నీ కుల-లింగ వివక్షతలను, అసమానతలు పెంచేందుకే ఏర్పడ్డాయని బౌద్ధం మతం కాకుండా తాత్విక ధోరణితో ఉందని అన్నారు. కుల,మతాలను ఖండిస్తూ బుద్ధుని ధమ్మం ముందుకు రావాలని కోరారు. జాషువా సాహిత్య సాంస్కృతిక సంస్థ అధ్యక్షులు ముప్పవరపు కిషోర్ మాట్లాడుతూ బౌద్ధ సామాజిక తాత్విక ఆలోచనతో అశోకుడు శాసనాలతోనే రాజ్యాంగం మౌలిక స్వభావం ఏర్పడింది. రాజ్యాంగం కల్పించిన హక్కులు కాల రాస్తున్నారు అందులో భాగంగానే సుప్రీంకోర్టు ఈమధ్య వెలువరిచిన తీర్పులో మతమార్పిడి వలన దళిత క్రిస్టియన్లు షెడ్యూల్ కులాల హోదాను కోల్పోతారని చెప్పటం రాజ్యాంగం లోని ఆర్టికల్ 15 కు వ్యతిరేకమైనది. షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు రక్షణ చట్టాలు విద్య ఉపాధిలో రిజర్వేషన్లు కూడా కోల్పోయే పరిస్థితి వస్తుందని అన్నారు. ప్రజలందరూ రాజ్యంగ మౌలిక సూత్రాలు తెలుసుకోవలసిన అవసరం ఉందని చెప్పారు. బహుజన టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్ అబ్దుల్లా మాట్లాడుతూ “బుద్దుని తాత్వికతను, అశోకుని నూతన సంస్కృతి విధానాలు, ఫూలే సామాజికొద్యమాన్ని, అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని ముందుకు తీసుకువెళ్లాలని అన్నారు అందుకు ఈ నలుగురు మహనీయుల జయంతుల నేపధ్యాన్ని వినియోగించు కోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుడిపూడి అంజయ్య, కల్లగుంట మోహనరావు, రాము (జిరాక్స్), E. కొండలరావణ్, కసుకుర్తి అంజయ్య, కే. వెంకటేశ్వర్లు, మందూరి రమణయ్య, ఉప్పుటూరి సుబ్రహ్మణ్యం,బీరకాయల. మాధవరావు,ధన్యాసి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ముందుగా మహా సామ్రాట్ మౌర్య అశోకుని జీవిత చరిత్రపై ఉపాసక గాండ్ల హరిప్రసాద్ బోది సంకలనపరిచిన బుక్ లెట్ ను ఆవిష్కరించారు.