తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

భారత జనగణన – 2027 gbకార్యక్రమం ఏప్రిల్ 16, 2026 నుండి ఏప్రిల్ 30, 2026 వరకు స్వయం ఇండ్ల గణన మొదటి దశ (Self Enumeration – SE) నిర్వహించబడుతుందని ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.,గారు తెలిపారు. అనంతరం మే 1, 2026 నుండి మే 30, 2026 వరకు ఇండ్ల గణన ప్రక్రియ నిర్వహించబడుతుంది. ఈ క్రమంలో మే 1వ తేదీ నుండి గణనకర్తలు (సచివాలయ ఉద్యోగులు) ఇంటింటికి వెళ్లి గృహ జాబితా సేకరిస్తారు.

స్వయం గణన (Self Enumeration) ప్రక్రియలో భాగంగా ప్రతి ఒక్కరూ భారత జనగణన http://se.census.gov.in పోర్టల్‌లో లాగిన్ అయి, అందులో అడిగిన వివరాలను నమోదు చేయాలని జిల్లా ఎస్పీ గారు తెలిపారు. రెగ్యులర్ ఇండ్ల గణన సందర్భంగా మే 1 నుండి 30 వరకు గ్రామ సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తారని, వారు అడిగిన సమాచారాన్ని సమగ్రంగా అందించి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేశారు.జనగణన ప్రక్రియలో భాగంగా గణనకర్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీపీలు (OTP), బ్యాంక్ వివరాలు లేదా ఇతర వ్యక్తిగత గోప్య సమాచారం, సర్టిఫికెట్లు అడగరని జిల్లా ఎస్పీ గారు స్పష్టం చేశారు. జనగణన పేరుతో డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా మోసాలకు పాల్పడే వ్యక్తుల నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోషల్ మీడియా, ఫోన్ కాల్స్ లేదా ఇతర మార్గాల ద్వారా ఎవరైనా ఓటీపీలు, బ్యాంక్ వివరాలు లేదా వ్యక్తిగత సమాచారాన్ని అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వవద్దన్నారు.ప్రజల సహకారంతోనే జనగణన కార్యక్రమం విజయవంతంగా పూర్తవుతుందని జిల్లా ఎస్పీ అన్నారు.ఈ కార్యక్రమంలో టి. రాంభూపాల్ రెడ్డి (Census Charge Officer),పి.అఖండ్ కుమార్ (Master Trainer), టి.సుజాత (census technical assistant) మరియు సిబ్బంది పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *