తొలి శుభోదయం న్యూస్ ఉలవపాడు:-

ఉలవపాడు మండలంలోని భీమవరం గ్రామంలో ఉన్న మోడల్ ప్రైమరీ స్కూల్‌లో ఎన్రోల్మెంట్ డ్రైవ్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు వేల్పుల రమేష్,తాటితోటి చంద్రమౌళి ఆధ్వర్యంలో చేపట్టారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు, తల్లిదండ్రులకు విద్య ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్న నాణ్యమైన విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్‌లు, మధ్యాహ్న భోజన పథకం వంటి సౌకర్యాలను వివరించారు.
చిన్నారులను పాఠశాలలో చేర్పించడం ద్వారా వారి భవిష్యత్తు బలపడుతుందని ఉపాధ్యాయులు స్పష్టం చేశారు. ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలను సమీపంలోని మోడల్ ప్రైమరీ స్కూల్‌లో తప్పనిసరిగా చేర్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయిని,ఉపాధ్యాయులు,అరుణ కుమారి, అనూష, సుభాషిణి, మేడికొండ భాస్కర్,గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *