తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
పవిత్ర రంజాన్ మాసం ముగింపు సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ మాజీ మంత్రివర్యులు, వైఎస్ఆర్సిపి PAC సభ్యులు, కొండేపి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ .ఆదిమూలపు సురేష్ హృదయపూర్వక ఈద్ ముబారక్ (రంజాన్ శుభాకాంక్షలు) తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, క్రమశిక్షణ, దానగుణం, భక్తి భావాలకు ప్రతీక రంజాన్ పండుగ అని కొనియాడారు. నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలతో, అల్లాహ్ అనుగ్రహం కోసం చేసే ప్రార్థనలు అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు.మత సామరస్యానికి అద్దంకి నియోజకవర్గం ఒక నిదర్శనం అన్నారు. అల్లా దయా కృప ప్రజలందరి పై ఉండాలని, ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలతో, సంతోషంగా జీవించాలని ఆయన మనసారా కోరుకున్నారు.కొండేపి నియోజకవర్గంలోని ముస్లిం పెద్దలు, యువకులు, మహిళలు ఈ పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు..