తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

ప్రయాణికుల భద్రతను మరింత బలోపేతం చేయడం, రద్దీ ప్రాంతాల్లో శాంతి భద్రతలను కాపాడటం లక్ష్యంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీసులు రైల్వే స్టేషన్‌లు మరియు ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లలో విస్తృత స్థాయి తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా రైల్వే స్టేషన్, బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను గుర్తించి తనిఖీలు చేపట్టి, వారి గుర్తింపు పత్రాలు (ID Proofs) పరిశీలించారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భద్రతా ఏర్పాట్లను సమీక్షిస్తూ, రద్దీ ప్రాంతాల్లో శాంతిభద్రతా పరిస్థితులను పరిశీలించి అవసరమైన సూచనలు సిబ్బందికి ఇచ్చారు.ప్రయాణికులు తమ సామానుపై అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా అనాధ వస్తువులు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు సూచించారు. ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా ఇలాంటి తనిఖీలు, గస్తీ చర్యలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.ప్రజలు పోలీస్ శాఖకు సహకరించి, ఏవైనా అనుమానాస్పద పరిస్థితులు ఎదురైతే వెంటనే డయల్ 100 లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు–పోలీసుల మరియు మార్కాపురం పోలీసుల సమన్వయంతోనే సురక్షితమైన, శాంతియుతమైన ప్రకాశం జిల్లా మరియు మార్కాపురం జిల్లా పోలీసులు సాధ్యమని పోలీసులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *