తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-

క్షణిక ఆవేశాలు, చిన్న చిన్న వివాదాలతో కేసులు పెట్టుకుని కోర్టుల్లో వైద్యాలు వేసి కోర్టు చుట్టూ తిరిగే వారికి లోక్ అదాలత్ సెటిల్మెంట్ రాజీ ద్వారా సత్వర న్యాయం లభిస్తుందని దాన్ని సద్వినియోగం చేసుకోవాలని సింగరాయకొండ జూనియర్ సివిల్ జడ్జి డా లీలా శ్యాంసుందరి కక్షిదారులకు హితవు చెప్పారు. శనివారం సింగరాయకొండ కోర్టు సముదాయం లో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో ఆమె పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని సింగరాయకొండ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సన్నెబోయిన శ్రీనివాసులు నాయుడు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జడ్జి డా వి లీలా శ్యాంసుందరి కోర్టు వ్యాద్యాలు, సివిల్, క్రిమినల్ కేసులు వాటి కారణంగా కక్షిదారులకు ఎదురయ్యే సమస్యలు గురించి అవగాహన కల్పించారు. క్షణిక ఆవేశం, చిన్న చిన్న వివాదాలతో కోర్టు కి వెళ్లి న్యాయంకోసం కోర్టు చుట్టూ తిరిగే వారికి జాతీయ లోక్ అదాలత్ ల ద్వారా సత్వర న్యాయం జరుగుతుందని వివరించారు. ఇరు పార్టీలు రాజీ పడి ఒక అవగాహనకు వచ్చి లోక్ అదాలత్ ద్వారా సెటిల్మెంట్ చేసుకుని అవార్డు పొందితే అది సుప్రీం కోర్టు తీర్పు తో సమానం అని ప్రతి కక్షిదారుడు అర్ధం చేసుకో వాలన్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం లో సింగరాయకొండ, కొండపి పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ లు చావా హాజరత్తయ్య, సోమ శేఖర్ , సింగరాయకొండ బార్ అసోసియేషన్ న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *