తొలి శుభోదయం న్యూస్ బాపట్ల:-

విద్య భవన్ నిర్మాణం కోసం బాపట్ల పట్టణంలోని ఉప్పరపాలెం రైల్వే గేట్ వద్ద ఉన్న ఉర్దూ ఉప తనిఖీ అధికారి కార్యాలయం ప్రాంగణంలోని ప్రభుత్వ స్థలాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ గురువారం పరిశీలించారు. 49 సెంట్ల విస్తీర్ణంలో విద్య భవన్ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. విద్యాశాఖకు సంబంధించిన అన్ని కార్యాలయ భవనాలను ఒకే చోట ఇక్కడే నిర్మించే విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు వెంటనే పంపాలని జిల్లా విద్యాశాఖ అధికారికి సూచించారు. అనంతరం పక్కనే ఉన్న ఆర్‌డబ్ల్యూఎస్ వాటర్ టెస్టింగ్ ల్యాబ్‌ను కూడా కలెక్టర్ పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయం చుట్టూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. కలెక్టర్ వెంట ఆర్డీవో గ్లోరియా, డీఈవో శ్రీనివాస్ సింగ్, తహసీల్దార్ షేక్ సలీమా ఉన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *