తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-

గత కొన్ని రోజులుగా కందుకూరు పట్టణం ఉప్పుచెరువు ప్రాంతంలోని ఒక ఇంటి వద్ద వ్యభిచారం జరుగుతుందన్న సమాచారం రావడంతో ఆదివారం కందుకూరు పట్టణ ఎస్సై పులి శివ నాగరాజు తన సిబ్బందితో కలిసి సదరు వ్యభిచారం జరుగుతున్న ఇంటి పై దాడి చేసి ఐదుగురు మహిళలను మరియు ఇద్దరు విటులను అదుపులోకి తీసుకొని వారిని పోలీస్ స్టేషన్ కి తరలించి వారిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే వారిపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు.ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *