వేసవి సెలవుల నేపథ్యంలో విద్యార్థులకు పలు సూచనలు చేసిన మంత్రి
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-
సింగరాయకొండలోని డా.బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను గురువారం నాడు రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సందర్శించారు. రేపటి నుంచి పాఠశాల విద్యార్థులకు వేసవి సెలవులు ఇస్తున్న నేపథ్యంలో విద్యార్థులు ఎండలకు బయట తిరగవద్దని, చెరువులు కాలువలలో ఈతలకు వెళ్ళకుండా సురక్షితంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం పాఠశాల ఆవరణలో నూతనంగా నిర్మించిన మరుగుదొడ్లను మంత్రి పరిశీలించారు. పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరిగినప్పుడు విద్యార్థుల తల్లిదండ్రులు భోజనం చేయడానికి, మీటింగ్ నిర్వహించేందుకు ఉపయోగించే మీటింగ్ హాల్ కు మళ్లీ పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి అయ్యేనాటికి వాటికి మరమ్మత్తులు చేయాలని అధికారులకు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సూచించారు.