తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి జిల్లా వ్యాప్తంగా వాహనదారులపై డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.మద్యం సేవించి వాహనం నడిపే వారి వల్ల జరుగుతున్న ప్రమాదాలను అరికట్టేందుకు, పోలీసులు సడన్ చెకింగ్ నిర్వహిస్తూ, అనుమానాస్పద డ్రైవర్లపై బ్రీథ్ అనలైజర్ టెస్టులు చేస్తున్నారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటూ, ప్రజల్లో అవగాహన పెంపొందిస్తున్నారు.ప్రజల ప్రాణాలు అమూల్యం — మద్యం సేవించి డ్రైవింగ్ చేయొద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.సురక్షితమైన రహదారులు, ప్రమాద రహిత ప్రయాణం కోసం ఈ తనిఖీలు నిరంతరం కొనసాగనున్నాయి.