తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా ఎస్పీ సూచనల మేరకు, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. అక్రమ రవాణా, అనుమానాస్పద కదలికలు, నేరాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించడానికి పోలీసులు నిరంతరం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.ఈ నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి, అక్కడ అనుమానితులను విచారించడం, రాత్రి పగలు గస్తీ బలపరచడం వంటి చర్యలు చేపట్టారు. నేరస్థులను మరియు నేరం చేయాలని చూస్తున్న వారిని అడ్డుకునేందుకు ప్రత్యేక డ్రైవులు కొనసాగుతోంది.ద్విచక్ర వాహనదారుల భద్రత దృష్ట్యా హెల్మెట్ తప్పనిసరి అంశాన్ని మరింత కఠినతరం చేస్తూ, హెల్మెట్ లేకుండా ప్రయాణించే వారికి ఫైన్లు విధించారు. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి హెల్మెట్ ధరించడం ఎంత ముఖ్యమో ప్రజలకు అవగాహన కల్పించారు.ప్రజల సురక్షిత జీవన వాతావరణం కోసం, క్రైమ్ నియంత్రణకు, చట్టవ్యవస్థ బలోపేతానికి ప్రకాశం పోలీసులు నిరంతరం పరిరక్షణ చర్యలు కొనసాగిస్తున్నట్లు అధికారలు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *