తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా నూతన ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని అధికారులు మరియు సిబ్బంది కలిసి రోడ్డు ప్రమాదాలను నివారించే లక్ష్యంతో రాత్రి పహారా విధులను ముమ్మరం చేశారు.ఈ క్రమంలో, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా పోలీసులు జాతీయ మరియు రాష్ట్ర రహదారులపై అర్ధరాత్రి 1 గంట నుండి తెల్లవారుజామున 4:30 గంటల వరకు ‘Face Wash and Go’ కార్యక్రమాన్ని నిర్వహించారు.హైవేలపై ప్రయాణిస్తున్న వాహనాలను ఆపి, డ్రైవర్లు అలసటతో డ్రైవింగ్ చేయకుండా ముఖం కడుక్కోవాలని, కొంత టీ తాగి తల్లడిల్లకుండా ముందుకు సాగాలని పోలీసులు సూచించారు. డ్రైవింగ్ సమయంలో కుటుంబ సభ్యుల గురించి ఆలోచించి బాధ్యతగా వ్యవహరించాలని అధికారులు ప్రత్యేకంగా డ్రైవర్లకు అవగాహన కల్పించారు.ప్రమాదాలు నివారించేందుకు, డ్రైవర్ల ప్రాణభద్రత కోసం ఈ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *