తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ తర్లుపాడు పోలీస్ స్టేషన్‌లో వార్షిక తనిఖీ (Annual Inspection) నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని వివిధ రికార్డులు, కేసు దస్త్రాలు, స్టాక్ రిజిస్టర్లు, M-Case & CD ఫైళ్లు, స్టేషన్ పర్యవేక్షణ పుస్తకాలు మొదలైనవన్నీ పూర్తిగా పరిశీలించారు.తనిఖీలో సీఐ ఎం. రాజేష్ కుమార్, అలాగే తర్లుపాడు ఎస్‌ఐ పాల్గొని స్టేషన్ పరిపాలన, పెండింగ్ కేసుల పురోగతిపై వివరాలు అందించారు.డీఎస్పీ స్టేషన్ సిబ్బందికి నేర నియంత్రణ, శాంతి భద్రతల నిర్వహణ, ప్రజా సేవలో పారదర్శకత, కేసుల వేగవంతమైన పరిష్కారం, రాత్రి పహారా విధులు, రౌడీ & సస్పెక్ట్ షీటర్ల పర్యవేక్షణపై తగిన సూచనలు అందించారు.
పోలీసు స్టేషన్ పనితీరును మెరుగుపరచి ప్రజలకు త్వరితమైన, నిష్పక్షపాత సేవలను అందించేందుకు అవసరమైన మార్గదర్శకాలను డీఎస్పీ వివరించారు.
