కందుకూరు లోని గుర్రంవారిపాలెంలో ఉన్న శ్రీ సంస్కృతి స్కూల్‌లో వినాయక చవితి నిమజ్జన వేడుకలు ఘనంగా, అంగరంగ వైభవంగా నిర్వహించారు. పాఠశాలలో ప్రతిష్ఠించిన వినాయకుడిని ఐదు రోజుల పాటు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు, కార్యక్రమాలతో ఆరాధించి, ఐదవ రోజున ఘనంగా నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. నిమజ్జనానికి ముందు వినాయకుడికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, గజహారతి ఇచ్చి, గజమాలతో అలంకరించి భక్తిశ్రద్ధలతో నిమజ్జన ఊరేగింపును ప్రారంభించారు.ఈ నిమజ్జన వేడుకల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులు వివిధ రకాల కోలాటాలు, నృత్యాలు ప్రదర్శిస్తూ, గణపతి పాటలు, అయ్యప్ప స్వామి భక్తిగీతాలు, ఇతర దేవతా గీతాలతో భక్తి వాతావరణాన్ని మరింత శోభాయమానంగా మార్చారు. విద్యార్థుల ఆనందోత్సాహాలు, భక్తి గీతాలు, రంగుల సందడి నిమజ్జన వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.నిమజ్జన ఊరేగింపు సాగుతున్న మార్గంలో భక్తులకు పులిహోర, పొంగలి ప్రసాదాలను పంపిణీ చేశారు. రంగులతో ఆనందాన్ని పంచుకుంటూ విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని వేడుకను మరింత వైభవంగా మార్చారు. సాంప్రదాయబద్ధంగా, భక్తి శ్రద్ధలతో గణనాథుడిని ఘనంగా సాగనంపారు.ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ శ్రీ కొంకా చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ, **విద్యార్థుల్లో భక్తి, సంస్కృతి, సంప్రదాయాల పట్ల అవగాహన పెంపొందించడం కోసమే ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు.ఐదు రోజుల పాటు భక్తితో పూజలందుకున్న విఘ్నేశ్వరుడు… ఐదవ రోజున ఆనందోత్సాహాల మధ్య నిమజ్జనంతో వీడ్కోలు అందుకున్నారు. భక్తితో ప్రారంభమైన వినాయక చవితి వేడుకలు, ఐక్యత మరియు ఆనందంతో ఘనంగా ముగిశాయి. గణనాథుని ఆశీస్సులు ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖశాంతులు, సౌభాగ్యం, విజయాలను నింపాలని శ్రీ సంస్కృతి స్కూల్ కుటుంబం ఆకాంక్షించింది.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన పాఠశాల చైర్మన్ కొంకా చంద్రశేఖర్ గారికి, వైస్ ప్రిన్సిపల్ శోభారాణి గారికి, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు పాఠశాల తరఫున ప్రిన్సిపల్ హరి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *